Health Wellness Centre Mulugu District
తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గారి కార్యాలయం ములుగు జిల్లా.
తేదీ: 07-09-2022
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ములుగు జిల్లా పరిధిలో Health Wellness Centre నందు NHM విభాగంలో పని చేయుటకు డాక్టర్, మొదటి ప్రాధాన్యత MBBS / రెండవ ప్రాధాన్యత BAMS / మూడవ ప్రాధాన్యత Staff Nurse (BSc (నర్సింగ్) / GNM & Community Health (30) పోస్టులు కాంట్రాక్ట్ పద్దతిపై నియామకానికి MBBS / BAMS అభ్యర్థులు Multi Zone-1 (కాలేశ్వరం జోన్, బాసర జోన్, రాజన్న జోన్, భద్రాద్రి జోన్,) స్థానికత కలిగి ఉండవలెను, మరియు Staff Nurse అభ్యర్థులు ZONE-1 (ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్,) స్టానికత కలిగి ఉండవలెను, BSC (నర్సింగ్) / GNM & Community Health ) అర్హులైన అభ్యర్థుల నుండి పూర్తిచేసిన దరఖాస్తు ఫారములు స్వీయ దృవీకరించిన సర్టిఫైడ్ కాపీలు జతపరిచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ములుగు నందు, అన్ని పని దినములలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సమర్పించవలెను, దరఖాస్తు ఫారంలను సమర్పించుటకు చివరి తేదీ 17/9/2022 సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే తీసుకొనబడును ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకొనబడవు.
(జిల్లా కలెక్టర్ ములుగు గారి ఆమోదంతో జారీ చేయనైనది)
గమనిక: నియామకపు, నియమ నిబంధనల కొరకు DM & HO కార్యాలయము మరియు జిల్లాలో గల PHC's లో సంప్రదించగలరు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ములుగు జిల్లా.
దీని ప్రతిని జిల్లా పొర సమాచార మరియు సంబంధాల అధికారి ములుగు గారికి ప్రచురణాల నిమిత్తం సమర్పించినది.
దీని ప్రతిని అన్ని పత్రికల ప్రతినిధులకు ప్రచురణ నిమిత్తము జారీ చేయడమైనది.