Type Here to Get Search Results !

Best Sounding TWS Buds Oppo Enco Buds 2 Review | ప్రైజ్ 1799/- రూపాయలు పెట్టారు.

Best Sounding TWS Buds Oppo Enco Buds 2 Review | Only Rs. 1799/-

Oppo Enco Buds 2 రీసెంట్ గా లాంచ్ చేసింది. ప్రైజ్ వచ్చేసరికి 1799/- రూపాయలు పెట్టారు. ఈ ఆర్టికల్ లో మనం దీని ఫస్ట్ ఇంప్రెషన్ ని మీతో షేర్ చేసుకుంటాను. 1799/- రూపాయలు ఇది తీసుకోవచ్చా లేదా అవన్నీ మనం చూద్దాం. 

OPPO-ENCO-BUDS2-TELUGU-NEWS-INDIA

ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ మీద మీకు Oppo Enco అని కనిపిస్తుంది. మరియు దీని బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి.

బాక్స్ లోపల చూసుకుంటే ఫస్ట్ మనకి బడ్స్ కేస్ తో పాటు వస్తున్నాయి. మరియు ఎక్స్ట్రా హియర్ టిప్స్ వస్తాయి. యూజర్ గైడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ డాక్యూమెంట్స్ అయితే ఉన్నాయి. ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చెయ్యట్లేదు. మీ దగ్గర ఉన్న వారితో పెట్టుకోవాలి. 

నెక్స్ట్ బడ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ బడ్స్ క్యాప్సూల్ టైప్ డిజైన్ తో వస్తుంది. మరియు మాట్ ఫినిష్ తో వస్తుంది. ఫింగర్ పట్టుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్స్ ని అయితే ఎట్రాక్ట్ చెయ్యట్లేదు. సైడ్స్ లో మాత్రం గ్లాసి ఫినిష్ తో వస్తుంది. టచ్ చేసె ఏరియాస్ లో మాట్ ఫినిష్ తో ఇచ్చారు. టాప్ లో మనకి బ్రాండ్ లోగో Oppo అని కనిపిస్తుంది. బోటంలో టైప్ సి పోర్ట్ మరియు ఒక యల్.ఈ.డి ఇచ్చారు.  టాప్ లో కొంచెం గ్లాసి ఫినిష్ తో కనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు  చెవిలో ఫర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి. బయటకి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్.

  • టచ్ ఏరియాస్ కూడా మీకు మాట్ ఫినిష్ తో వస్తున్నాయి కాబట్టి ఇవి ఫింగర్ ప్రింట్స్ ని ఏమి ఎట్రాక్ట్ చేయవు. 
  • డిజైన్ అయితే చాలా బాగా చేశారు. మొత్తం మీద ఇది ఫ్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. 
  • దీని వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఒక్కొక్క బడ్స్ మీకు 4గ్రాములు అయితే ఉంటుంది.
  • కేస్ అయితే మీకు 30 గ్రాములు వరకు అయితే ఉంటుంది. క్యారీ చేయడం కూడా చాలా ఈజీ.

కనెక్షన్ :

దీన్ని కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మీ మొబైల్ ఫోన్ లో బ్లుటూత్ ఆన్ చేయండి. ఈ బడ్స్ ని కేస్ లో పెట్టి కాప్ ఓపెన్ చేయండి. సింపుల్ మీకు బ్లుటూత్ ఆప్షన్స్ లో ఎన్ కో బడ్స్2 అని కనిపిస్తుంది. వీటిని ఈజీగా పెయిర్ చేయొచ్చు. 2 డివైజ్ లకు ఒకేసారి కనెక్ట్ చేసి ఉస్ చేసే ఆప్షన్స్ వీటిలో లేదు. 

టచ్ కంట్రోల్స్ ని మీరు కంట్రోల్ చేయాలి అనుకుంటే నాన్ ఒప్పో డివైజెస్ కి HeyMelody అనే యాప్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఒప్పో ఫోన్ ఉంటె డైరెక్ట్ గా మీరు బ్లుటూత్ లోకి వెళ్లి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. 

హియర్అ బడ్స్ ఫంక్షన్స్ లోని వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తరువాత మీకు మొత్తం ఆప్షన్స్ అన్నిమీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. 

మీకు బడ్స్ లో ఎంత బ్యాటరీ ఉందో కనిపిస్తుంది. మరియు ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ సౌండ్, బేస్ బూస్ట్, క్లియర్ ఓకల్స్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు ఉంటాయి. మీ ఇష్టం మీరు వినే సాంగ్ ని బట్టి. మీరు ఓల్డ్ సాంగ్స్ ని పెట్టుకుంటే క్లియర్ ఓకల్స్ పెట్టుకోండి. బేస్ ఎక్కువ కావాలనుకోండి బేస్ బూస్ట్ పెట్టుకోవచ్చు. నార్మల్ గా అయితే నేను ఉస్ చేసినప్పుడు ఐతే ఒరిజినల్ సౌండ్ చాలా బెటర్ అనిపించింది. 

బడ్స్ కంట్రోల్ :

ఇయర్ బడ్స్ కంట్రోల్స్ లోకి వెళ్తే అక్కడ లెఫ్ట్, రైట్ డిఫెరెంట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ నేను చేంజ్ చేశాను. మీకు నచ్చినట్లు మీరు చేంజ్ చేసుకోవచ్చు.  ఆప్షన్స్ లోకి వెళ్లి మీకు నచ్చినవన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. 

  • సింగిల్ టాప్ కి రెండే ఫంక్షన్స్ ఉన్నాయి. డబుల్ టాప్ కి చాలా ఫంక్టన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోండి.
  • మీరు సౌండ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, నెక్స్ట్ ట్రాక్ కి వెళ్లొచ్చు, ప్రీవియస్ ట్రాక్ కి వెళ్లొచ్చు. గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చెయ్యొచ్చు. మరియు గేమ్ మోడ్ లోకి ఎంటర్ అవ్వొచ్చు. మొత్తం ఆప్షన్స్ అయితే ఉంటాయి. 

నాకు నచ్చినట్లు నేను టచ్ కంట్రోల్స్ సెట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. అన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఏ ఒకటి మిస్ అయింది అని చెప్పేసి ఏమి చెప్పలేము. అన్ని ఫంక్షన్స్ అయితే మీకు టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఉన్నాయి. 

OPPO-ENCO-BUDS2

sound quality (సౌండ్ క్వాలిటీ)

  • దీనిలో మనం మెయిన్ మాట్లాడాల్సింది సౌండ్ క్వాలిటీ గురించి.  మనం కొనుక్కునేది కూడా దానికోసమే. దీనిలో మీకు 10MM టైటానియం డ్రైవర్స్ ఉంటాయి. 
  • ఇవి చాలా క్వాలిటీ డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ లో నార్మల్ గా సౌండ్ వింటున్నప్పుడు అయితే నేను ఇప్పటివరకు చాలా బడ్స్ లో విన్నాను. వీటిలో మీకు ముఖ్యంగా హైస్ చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి. హై ఇంస్ట్రుమెంటల్ సౌండ్స్ ఉంటాయికదా అవి చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి.
  • మిడ్స్ ఏవైతే అయితే మనకి సింగర్ పాడుతున్నారో వాయిస్ చాలా క్లియర్ గా వస్తున్నాయి. 
  • బేస్ కూడా మరి ఓవర్ లేదు. మిడ్స్ ని డిస్ట్రబ్ చేసేలా లేదు. చాలా బాగుంది. 
  • ఓవరాల్ గా అయితే మీకు చాలా బాలన్స్ అనిపిస్తది. మీరు ఫస్ట్ సౌండ్ వినగానే మీకు చాలా ఇంప్రెస్ అవుతారు. 
  • సౌండ్ ఒరిజినల్ సౌండ్, బేస్ బూస్ట్, ఓకల్స్ ఉన్నాయి కదా! మూడిట్లో బేస్ బూస్ట్ లో పెట్టుకుంటే మీకు కొద్దిగా 5% బూస్ట్ అవుతుంది. అంతకు మించి ఎక్కువ అయితే అవ్వట్లేదు. 
  • ఒరిజినల్ సౌండ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. డైరెక్ట్ మీరు తీసి ఉస్ చేయండి. మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు దీని నుంచి పొందుతారు. 

సౌండ్ పరంగా మాత్రం ఇది మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తది. ముఖ్యంగా దీనిలో హై ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ బెటర్ గా వినిపిస్తున్నాయి. 1799/- కి ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. 

గేమింగ్ మోడ్ :

ఈ బడ్స్ లో గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది. 94ms లాటెన్సీ అయితే ఇందులో ఉంటుంది. గేమింగ్ మోడ్ లోకి ఎంటర్ అవడానికి మీరు ఏదైనా కమాండ్ అయితే పెట్టుకోవచ్చు. నేను రైట్ సైడ్ కి ట్రిపుల్ టాప్ పెట్టాను. గేమింగ్ మోడ్ ఆన్ అని చెప్పేసి మీకు వాయిస్ కమాండ్ అయితే వస్తది. మళ్ళీ ట్రిపుల్ టాప్ చేస్తే మళ్ళీ గేమింగ్ మోడ్ ఆఫ్ అని ఇట్లా అయితే వస్తుంటది. గేమింగ్ మోడ్ లోకి ఎంటర్ అయిన తరువాత మీకు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. నేను BGMI ఆడాను. నాకైతే లాగ్ అయితే ఏమి అనిపించలేదు. సౌండ్ అయితే ఫర్ఫెక్ట్ అయితే ఉంది. కాకపోతే నేను ఎప్పుప్పుడు చెప్తానే ఉంటాను. గేమింగ్ అయితే మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ తీసుకోండి. ఎక్కువ గేమ్స్ అడేవాళ్లు అయితే. 

లైట్ గేమ్స్ ఆడవాళ్లకు ఐతే మాత్రం ఇట్లాంటి వైర్లెస్ అయితే మీకు సెట్ అవుతాయి కానీ మీరు గేమింగ్ మాత్రమే ఆడాలి అనుకుంటే మాత్రం వైర్డ్ ఇయర్ ఫోన్స్ మీకు ఇంకా బెటర్ ఉంటాయి. 

బ్యాటరీ :

బ్యాటరీ విషయానికొస్తే మీకు బడ్స్ లో 40mAh బ్యాటరీ ఉంటది. కేస్ లో వచ్చేసరికి 460 mAh బ్యాటరీ ఉంటది. మొత్తం కలిపి మీకు వీళ్ళు చెప్తుంది 28 గంటల వరకు యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. బడ్స్ లో 50% వాల్యూమ్ మీరు పెట్టి వింటే 7 గంటల వరకు వస్తుంది. ఒకవేళ మీరు ఫోన్ కాల్స్ మాట్లాడాలి అనుకుంటే మాత్రం 4 గంటల ఐతే మీకు బ్యాటరీ లైఫ్ వస్తది.

కేస్ లో మీకు బ్యాటరీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కేస్ తో కలిపి అయితే మీకు ఈజీ గా 24 గంటలకు పైగా మీకు బ్యాటరీ అయితే వస్తది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 50% వాల్యూమ్ లో మీరు రోజుకి 4 గంటలు వింటే ఒక వారం రోజులు మీరు ఈ బడ్స్ అయితే యూజ్ చెయ్యొచ్చు. 

దీంట్లో మీకు యాక్టీవ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇట్లాంటివి అయితే ఏముండదు. కాకపోతే కాల్స్ కి మీకు AI డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చారు. ఇది ఏం చేస్తుందంటే బ్యాగ్రౌండ్ నాయిస్ ని కట్ చేసి మీ వాయిస్ ని ఎన్ హన్స్ చేస్తుంది. అవతల వాళ్ళకి మీరు మాట్లాడేది క్లియర్ గా వినిపిస్తుంది. 

ఛార్జింగ్ :

ఛార్జింగ్ విషయానికి వస్తే 10 నిమిషాలు ఛార్జ్ పెట్టి 1 గంటసేపు మ్యూజిక్ అయితే వినొచ్చు. ఫుల్ ఛార్జ్ చెయ్యాలంటే మాత్రం 90 నిముషాలు వరకు టైం తీసుకుంటది. ఒకవేళ కేస్ ఛార్జింగ్ చేయాలంటే 200 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. 

వాటర్ రెసిస్టెంట్ :

వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే మీకు IP X4 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. మీరు జిమ్ కి తీసుకెళ్లొచ్చు. స్వెట్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీ ఫోన్ లో డాల్బీ ఎట్మాస్ ఉంటే మాత్రం దీనిలో డాల్బీ ఎట్మాస్ సపోర్ట్ కూడా ఉంటది. ఇంకా మీకు బెటర్ ఆడియో ఎక్సపీరియెన్స్ అయితే ఉంటది. కోడాక్ వచ్చేసరికి ASC SDC కోడాక్  సపోర్ట్ అయితే ఉంటుంది. 

ఓవరాల్ అయితే నాకు సౌండ్ ఇంప్రెస్ చేసింది ఆ ప్రైజ్ 1799/- కి. బడ్జెట్ లో మీకు 1000 రూపాయలకు కూడా దొరుకుతాయి. కాకపోతే మీకు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం 1799/- పెట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. 

బాలన్స్ సౌండ్ అయితే ఉంటది. నాకు ముఖ్యంగా హైస్ అయితే నాకు ఈ బడ్స్ లో బాగా నచ్చినాయి. ఇప్పుడి వరకు చాలా విన్నా నేను హై ఫ్రీక్వెన్సీ చాలా బాగా వస్తుంది. బాలన్స్ సౌండ్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ వినేటప్పుడు మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయవు. 

ఈ ఆర్టికల్ నచ్చితే మన వెబ్సైట్ ని FOLLOW అవ్వండి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.