Born on the same day. Died on the same day
Born on the same day, Died on the same day జీవితంలో ఒక్కోసారి జరిగే కొన్ని అరుదైన సంఘటనలు మనల్ని షాక్ కి గుర్తిస్తాయి. అవి జరగడానికి సరైన కారణం దొరకానప్పటికీ ఇలా కూడా జరుగుతాయా అనే సందేహం కలుగుతుంది. అవి మన చుట్టూ జరిగే సంఘటనలు కావచ్చు.
తాజాగ ఒక ఇంట్లో జరిగిన ఘటన ఇప్పుడు ఆ నోటా ఈ నోటా నానుతుంది. ఒకే రోజు పుట్టిన ఇద్దరు మహిళలు ఒకే రోజు మరణించడం సంచలనంగా మారింది.
ఏంటి ఒకే రోజు పుట్టిన వారు ఒకే రోజు మరణిస్తారా! అంటే దానికి సమాధానం ఎవరైనా కాదు అనే అంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరగలేదు. కవలల విషయంలో కూడా ఇలాంటివి ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. అనారోగ్య సమస్యలు లేదా ఏ యాక్సిడెంట్ అయితేనో ఒకే రోజు పుట్టిన ఇద్దరు ఒకే రోజు మరరించారు అంటే నమ్మొచ్చు. కానీ సహజంగా అది కూడా గంటల వ్యవధిలో చనిపోయారంటే ఏదో కిటుకున్నట్లే కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఒకరి వెంట మరొకరు మృతి చెందారు.
కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దుల బజారుకు చెందిన జానపాటి మల్లమ్మ కుమార్తె అచ్చమ్మ ను ఇదే గ్రామానికి చెందిన పంకు యాకమ్మ కుమారుడైన యాకయ్య కి ఇచ్చి పెళ్లి చేసారు.
మల్లమ్మ, యాకమ్మ ఇద్దరు ఇల్లు పక్క పక్కనే ఉండగా వారిద్దరూ చాలా ఆప్యాయంగా ఉండేవారు. అయితే సెప్టెంబర్ 3న తెల్లవారుజామున మల్లమ్మ గుండెపోటుతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన యాకమ్మ మల్లమ్మ మృతదేహం వద్ద విలపించింది. ఇద్దరం ఒకే రోజు పుట్టానని సోకం పెట్టింది.
అనంతరం అంత్యక్రియలు పూర్తయిన తర్వాత యాకమ్మ తన ఇంటికి వెళ్ళగా కొద్దిసేపటికే ఆమె కూడా గుండెపోటుతో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్ళూ ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
గంటల వ్యవధిలోనే జన్మించారు
ఇది ఇలా ఉండగా మల్లమ్మ యాకమ్మలు కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే రోజు జన్మించినట్లు స్థానికులు తెలిపారు.
ఒకే రోజు జన్మించారు. ఒకే రోజు మరణించారు. ఇలా జరగడం విధి విచిత్రం అని చెప్పుకోవాలి. ఇది వింటుంటే వారి మరణం కూడా ఒకే రోజు జరగడం విధి విచిత్రం. మీరు కూడా ఇలాంటి ఘటన గురించి విన్నారా? కామెంట్ లో తెలుపండి.