వెంకటాపురం సెప్టెంబర్ 3 NEWS INDIA : ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో గోదావరి నది నుండి ఇసుక క్వారీల నిర్వహణ కోసం మండలంలోని ఐదు పంచాయతీలలో, ఈనెల 5వ తేదీ నుండి పీసా గ్రామ సభలు నిర్వహించి, ఆమోదం పొందాలని, ములుగు జిల్లా సహకార శాఖ అధికారి ఆదేశించారు. ఈ మేరకు వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.బాబు ఆయా పంచాయతీల సర్పంచులకు, జి.పి. కార్యదర్శులకు, పీసా కమిటీ సభ్యులకు ఉత్తర్వులు కాపీల సమాచారాన్ని తెలియపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆలుబాక జి.పి. కేంద్రంలో ఈనెల 5వ తేదీన, బోదాపురం పంచాయతీ కేంద్రంలో, అదే రోజున రెండు చోట్ల ఒకే రోజున పీసా గ్రామసభలు నిర్వహించనున్నారు.
అలాగే ఎదిర పంచాయతీ కేంద్రంలో ఒంటి చింతలగూడెం క్వారీ నిర్వహణకు 6వ తేదీన పాత్రాపురం పంచాయతీ పరిధిలోని పాలెం క్వారీ నిర్వహణకు 6వ తేదీన ఒకేరోజు రెండు పీసా గ్రామసభలు అధికారులు నిర్వహించనున్నారు. రామచంద్రవురం పంచాయతీలో, 7వ తేదీన, అదే పంచాయతీ పరిది లోని పూజారిగూడెం లో అదే రోజు పీసా గ్రామ సభలు నిర్వహించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో ప్రచారం చేయాలని ఉత్తర్వులు,లో పేర్కొన్నారు. ఆదివాసీలకు సంబంధించిన ఇసుక సాసైటీ క్వారీలకు ప్రభుత్వం మరో 6క్వారీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.