Reasons for the downfall of the Congress system in India
Reasons for the downfall of the Congress system in India చిన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీకి ఇంత ఫాలోయింగ్ ఏంట్రా బాబు అనుకునేవాడిని, అసలు ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీని ఎవరైనా ఓడించగలరా అని అనుకునేవాడిని మనలో చాలా మంది కూడా అలాగే అనుకునే ఉంటారు అప్పట్లో.
కానీ దేశ రాజకీయాల్లో ఒకప్పుడు మహారాజుల ఉండే కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు తల క్రిందలు అయిపోయింది. ఓన్లీ రాజస్థాన్, చతిస్గడ్ లో మాత్రమే కాంగ్రెస్ సభ్యులు సీఎంగా ఉన్నారు. ప్రజలు 2024లో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనేది మాట్లాడుకోవడం పక్కన పెట్టేసి అసలు కాంగ్రెస్ కనీసం అపోజిషన్ పార్టీ లాగా నేను ఉంటుందా ? అని మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తమ పట్టణానికి దగ్గరగా ఉంది. దీంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు.
అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైంది.? ఏం తప్పులు చేస్తే ఇలాంటి పరిస్థితికి వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలి?
చాలా సింపుల్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవ్వాలి.
స్ట్రాంగ్ అవడం అనేది జస్ట్ వాళ్ళ సొంత లాభాల కోసమే కాదు, దేశం కోసం కూడా. ఎందుకంటే కంట్రీలో స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండటం ఎంత ముఖ్యమో దానితోపాటు స్ట్రాంగ్ అపోజిషన్ ఉండటం కూడా చాలా ముఖ్యం. కాంగ్రెస్ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ గా ఉండకపోతే వేరే పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ ప్లేస్ లోకి రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా వేరే పొలిటికల్ పార్టీ అపోజిషన్ పార్టీగా మారాలంటే ఫస్ట్ అది నేషనల్ లెవెల్లో బాగా పాపులర్ అవ్వాలి. చాలా స్టేట్లో దానికి మంచి పట్టు ఉండాలి. ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా కష్టమైన పని. సింపుల్గా చెప్పాలంటే ఇంకొన్ని సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీయే మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కనీసం 2023లో జరిగే రాజస్థాన్ మరియు చత్తీస్గఢ్లో జరిగే ఎలక్షన్లలో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి 2024 ఎలక్షన్స్ లో కొద్దిగా అయినా పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఒకవేళ రాజస్థాన్ మరియు చత్తీస్గడ్ లో గనక ఓడిపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆల్మోస్ట్ కనుమరుగైపోయినట్టే. కాంగ్రెస్ పార్టీ ముందున్న మెయిన్ గోల్ 2023 రాజస్థాన్ మరియు చత్తీస్గడ్ ఎలక్షన్స్. ఇంకో వన్ ఇయర్ టైం ఉంది. ఈ వన్ ఇయర్ లో కాంగ్రెస్ చేసిన తప్పులన్నీ సరి చేసుకోవాలి.
అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన మిస్టేక్స్ ఏంటి?
![]() |
రాహుల్-గాంధి |
ఫస్ట్ వన్: Nepotism: కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాండేట్ అయిన రాహుల్ గాంధీ మీద dynasty politician అని ముద్ర ఉంది. డైనాస్టీ అంటే మీకు తెలుసు కదా రాజ్య వంశం. ఈ కేసులో చెప్పాలంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్. ఇప్పుడు వేరే పొలిటికల్ పార్టీలో ఉన్న పోటీసం లేదా అంటే డైనాస్టిస్ లేరా అంటే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సమాజ్వాది పార్టీ లో అఖిలేష్ యాదవ్ గాని, శివసేనలో ఉద్ధవ్ ఠాగూర్ గాని అంత దూరం ఎందుకు మన దగ్గరే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గాని మన పక్క తీసుకుంటే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు గాని, బిజెపిలో చూసుకుంటే తేజస్వి సూర్య, వరుణ్ గాంధీ, పూనం మహాజన్, పియుజ్ గోయల్, వీళ్లంతా నేపోటిజం కాండిడేట్స్. ఇంకెందుకు కాంగ్రెస్ లో కూడా రాహుల్ గాంధీ కాకుండా డైనాస్టిక్ పొలిటిషన్స్ చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ పైలెట్ గాని, అల్లా శాస్త్రి గాని, సల్మాన్ కుర్షిత్ గాని, వీళ్లంతా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లే.
మరి ఇంతమంది ఉంటే రాహుల్ గాంధీని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారు.? డైనాస్టిక్ పొలిటిషన్ అని ఎందుకు ముద్ర వేశారు.?
దీని వెనక 2కారణాలు ఉన్నాయి.
ఫస్ట్ వన్: రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క అనపిసియల్ హెడ్.
సెకండ్ వన్: రాహుల్ గాంధీ అంత సమర్ధత ఉన్న నాయకుడు అయితే కాదు. నిజంగా రాహుల్ గాంధీ సమర్ధుడై ఉంటే జనాలు అతని మీద ఈ డైనాస్టిక్ పొలిటిషన్ అనే ముద్రను వేసేవాళ్ళు కాదు.
దీని గురించి ఒక ఎగ్జాంపుల్ తో రాహుల్ గాంధీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ సైట్ ని గనుక మీరు ఒకసారి ఓపెన్ చేస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ సోనియా గాంధీ అని ఉంటుంది. క్రిందికి స్క్రోల్ చేస్తే 9 మంది జనరల్ సెక్రెటరీ లిస్ట్ ఉంటుంది. ఈ 9మందిలో ప్రియాంక గాంధీ పేరు ఉంటుంది గానీ రాహుల్ గాంధీ పేరు ఉండదు. ఇది కాకుండా ప్రతి స్టేట్లో ఒక స్టేట్ ఇంచార్జిని కూడా మేము ఇస్తారు. ఈ లిస్టు కూడా సైట్ లో ఉంటుంది. ఈ లిస్టులో కూడా రాహుల్ గాంధీ పేరు ఉండదు.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అని సపరేట్గా 20 మందితో ఒక లిస్ట్ ఉంటుంది. ఆల్ లిస్టులో రాహుల్ గాంధీ పేరు ఉంటుంది.
ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీని సీరియస్ గా తీసుకోనప్పుడు ప్రజలు ఇతర పార్టీ వాళ్లు ఎందుకు సీరియస్ గా తీసుకుంటారు.
యాక్చువల్ గా 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ తరువాత ఆయన రిజైన్ చేసేసారు. ఇప్పుడు 2022లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఫ్రంట్ ఫేస్ రాహుల్ గాంధీ అని ఎందుకు అనిపిస్తుంది. అఫీషియల్ ప్రెసిడెంట్ కానీ రాహుల్ గాంధీ ఎందుకు ర్యాలీస్ లో, ప్రెస్ మీట్స్ లో క్యాంపెన్స్ లో ఎందుకు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఎంత బ్యాడ్ గా ఉందనేది ఆ పార్టీ ప్రెసిడెంట్ అయిన సోనియా గాంధీ గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అర్థమవుతుంది. పార్టీకి అఫీషియల్ ప్రెసిడెంట్ అయిన సోనియా గాంధీ గారు ఏ పొలిటికల్ ర్యాలీస్ లో కనిపించరు, ఏ ఇంటర్వ్యూస్ లో కనిపించరు. కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండరు. ఇప్పుడు నేను సోనియా గాంధీ గారు సమర్థతలేని లీడర్ అని నేను చెప్పట్లేదు. ఇంపాక్ట్ చెప్పాలంటే 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దాంట్లో ముఖ్యపాత్ర సోనియా గాంధీ గారిదే. కానీ ఇప్పుడు అఫీషియల్ ప్రెసిడెంట్ అయిన ఆమె ఎందుకు ఎక్కడ కనిపించరు.
సోనియా గాంధీ గారిని కొద్దిసేపు పక్కనపెట్టి ఒకసారి ప్రియాంక గాంధీ గారి గురించి మాట్లాడుకుందాం..
![]() |
ప్రియాంక-గాంధీ |
చాలామంది కాంగ్రెస్ సపోటర్స్ ఒకటి మాత్రం గట్టిగా నమ్మే వాళ్ళు. ప్రియాంక గాంధీ ఒక ట్రంప్ కార్డ్. ఆమె కచ్చితంగా పార్టీని కాపాడుతుందని ఒక్కసారి ఆమె రంగంలోకి దిగితే శీను వేరే లాగా ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఆమె రంగంలోకి దిగారు కానీ ఏం జరగలేదు. కాంగ్రెస్ కి ఉత్తరప్రదేశ్లో జస్ట్ 2సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రియాంక గాంధీ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా! ఆమె కొంచెం ఇందిరా గాంధీ లాగా ఉంటారంట. అసలు ఇలాంటి రీజన్ తో ఒక పొలిటిషన్ ని పార్టీకి పేస్ గా ఎక్స్పెక్ట్ చేయడంలోనే అర్థమవుతుంది ఆ పార్టీ ఫంక్షన్ ఎలా ఉందో. గాంధీ ఫ్యామిలీ అనే నేమ్ ని యూస్ చేసుకొని ఓన్లీ ముగ్గురిని ముందు పెట్టుకుని పార్టీని రూలింగ్ లోకి తీసుకురావాలి అని ట్రై చేస్తే మిగతా పార్టీ వాళ్లు, ప్రజలు, డైనాస్టిక్ పార్టీ అని కచ్చితంగా క్రిటిసైజ్ చేస్తారు.
రెండో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో మిగతా లీడర్స్ ఎక్కడ ఇప్పుడు గాంధీ పార్టీ లో ఉన్న ముగ్గురుని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంచి లీడర్స్ పేర్లు చెప్పమంటే ఎవరు గుర్తు రారు కూడా.
కానీ కంపేరిజన్లో బిజెపిని తీసుకోండి. బిజెపిలో లీడర్స్ ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆదిత్యనాథ్, నితిన్ గట్కరి, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, సంబిత్ పాత్ర, మనోహర్ పడికలర్, రాజ్నాథ్ సింగ్, స్మృతి రాణి, సుబ్రహ్మణ్యస్వామి, పీయూష్ గోయల్, మనోజ్ తివారి, అనురాగ్ ఠాకూర్, ప్రగ్య ఠాకూర్ ఇలా చాలామంది పేర్లు ఈజీగా చెప్పొచ్చు.
ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ పేర్లు చెప్తాను వీళ్లలో మీకు ఎంతమంది తెలుసు చూడండి. కాంగ్రెస్ పార్టీ యొక్క లోక్సభ లీడర్ అయినా అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ లీడర్ మల్లికార్జున్ కార్గే, కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రెజరర్ పవన్ కుమార్ పన్సెల్, జనరల్ సెక్రెటరీ అజయ్ మక్కెన్, వీళ్ళతోపాటు అవినాష్ పాండే, జితేంద్ర సింగ్, కేసి వేణుగోపాల్ ఇలా చాలామంది ఉన్నారు. ఐ యాం సూర్ వీళ్లలో చాలామంది మీకు తెలిసి ఉండరు కూడా. అంటే బిజెపి లీడర్స్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఎవరు సరిగ్గా తెలిసి ఉండరు.
నేను ఇక్కడ ఎవరూ మంచి పొలిటిషియన్స్, ఎవరు చెడ్డవాళ్ళు అని కంపేర్ చేయట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బిజెపి లీడర్స్ లో ఎంతమంది ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ లీడర్స్ లో ఎంతమంది ప్రజలకు తెలుసు అనేది. పాపులర్ ఐ ప్రజలకు తెలిస్తేనే కదా లీడర్స్ గురించి తెలిసేది. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఫేమస్ అయిన లీడర్స్ కూడా ఉన్నారు. కానీ వీళ్లు ఫేమస్ అయింది మంచి రీజన్స్ కి కాదు. కమల్ నాథ్ అండ్ పి చిదంబరం వీళ్ళు స్కామ్స్ వల్ల ఫేమస్. దిగ్విజ సింగ్ ఈయన తన లవ్ ఎఫైర్స్ తో ఫేమస్ అయ్యాడు. మణిశంకర్ అయ్యర్ ఈయన నరేంద్ర మోడీ గారిని తిట్టి ఇన్సల్ట్ చేసి ఫేమస్ అయ్యాడు. కపిల్ సిఫాల్, సల్మాన్ కుర్షిత్ వీళ్లు కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పుడు మినిస్టర్స్ గా ఉన్నారు. కాంగ్రెస్ పవర్ పోగానే కాముగా లీడర్స్ గా మారి పోయి లా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు.
మంచి విషయాలతో లేదా ప్రజల కోసం పోరాడి ఫేమస్ అయిన ఫేమస్ కాంగ్రెస్ లీడర్స్ ప్రజెంట్ లేరు. ఎక్కువగా పొలిటికల్ పార్టీస్ ప్రజల కోసం పోరాటాలు, ఆందోళనలు చేస్తాయి. గ్రౌండ్ వర్క్ బాగా చేస్తాయి. కానీ నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇలాంటివి ఏమీ చేయరు. అందుకే వీళ్ళు న్యూస్ లో కనిపించరు. అసలు కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అయ్యేలాగా రీసెంట్ ఇయర్స్ లో చెప్పుకోదగిన పని ఏమీ చేయలేదు. అందువలన ఇక్కడ ప్రాబ్లం రాహుల్ గాంధీ లోనే కాదు, మిగతా కాంగ్రెస్ లీడర్స్ లో కూడా ఉంది. సడన్ గా గాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎగ్జిట్ అయిపోతే మిగతా లీడర్స్ పార్టీని నడపగలరా? అని కొషన్ చేస్తే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. 2018, 2020లో కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ ఫేమస్ లీడర్ ఎవరని ఇండియా టుడే, ఏబీపీ ABP న్యూస్, ఫస్ట్ పోస్ట్ సర్వే చేస్తే ప్రతి సర్వేలో రాహుల్ గాంధీ పేరే వచ్చింది. ట్రోలింగ్ వలనో ఫ్యామిలీ నేమ్ వలనో రాహుల్ గాంధీ బాగా ఫేమస్ అయ్యారు. కానీ మిగతా లీడర్స్ ఆయన షాడో లో ఉంటున్నారు కానీ ఏదో ఒకటి చేసి ప్రజలకు దగ్గర అవటానికి మాత్రం ట్రై చేయట్లేదు.
ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీలో విషయము ఉన్న వారు లేరా అంటే ఉన్నారు.
ఇప్పుడు కన్నయ్య కుమార్ తీసుకోండి ఈయన రీసెంట్గా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఈయన భయంకరమైన ఫేమస్. శశితరూర్ గాని ధీపేంద్ర గూడ గాని గౌరబ్ వల్లబ్, సచిన్ పైలెట్, బీ.వీ శ్రీనివాస్ ఇలాంటి లీడర్స్ ఉన్నారు. బివి శ్రీనివాస్ ని అయితే ఆక్సిజన్ మాన్ అంటారు. ఎందుకంటే ఈయన కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ అందించి ప్రజలకు బాగా హెల్ప్ చేశాడు. ఇలా మంచి వాయిస్ సెండ్ సమర్థత ఉన్న యంగ్ లీడర్స్ ఉన్నారు.
కానీ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వీళ్లని వీళ్ళ పాపులారిటీని యూజ్ చేసుకోవడం లేదు. కాంగ్రెస్ మళ్లీ పవర్ ని అందుకోవాలంటే రాహుల్ తో పాటు ఈ లీటర్స్ కూడా సపోర్ట్ చేసి పైకి తీసుకొని రావాలి.
ఇంకా థర్డ్ విషయానికి వస్తే థర్డ్ విషయం కూడా రాహుల్ గాంధీకి రిలేటెడ్. రాహుల్ గాంధీని పేస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీగా చెక్ చేయాలి అని అనుకున్నారు. కానీ దానికి తగిన వర్క్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. దానికి తగిన ఎక్స్పీరియన్స్ ని రాహుల్ గాంధీ సంపాదించలేదు. 2000 లో రాహుల్ గాంధీకి 30 సంవత్సరాలు. ఆ టైం నుండి ఆయన తన పొలిటికల్ కెరీర్ ని జాగ్రత్తగా బెల్ట్ చేసుకొని ఉంటే బాగుండేది. అప్పుడు ఏదైనా రాష్ట్రం తీసుకొని అక్కడ నుండి క్యాంపెయిన్ చేసి సీఎంగా పోటీ చేసి ఉండాల్సింది. 2004లో కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ చేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు రాహుల్ గాంధీ గారిని క్యాబినెట్లో ఏదో ఒక మినిస్టర్ గా చేసే ఛాన్స్ ఉంది. పార్టీ రాహుల్ ని క్యాబినెట్లో కూర్చోబెట్టి ఎక్స్పీరియన్స్ సంపాదించే ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. కానీ అది చేయలేదు.
2009లో కూడా కాంగ్రెస్ మళ్లీ గెలిచింది. సెకండ్ టైం గెలిచింది కాబట్టి హోంగాని, ఫైనాన్స్ గాని, డిఫెన్స్ గాని, ఎక్స్టర్నల్ అఫైర్స్ గాని ఇలాంటి ఏదో ఒక పవర్ఫుల్ క్యాబినెట్ ని రాహుల్ గాంధీకి ఇచ్చి ఉంటే ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ గైన్ చేసుకొని ఉండేవారు. కానీ అది కూడా చేయలేదు.
ఒక ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కాండేట్ కి ఇవ్వాల్సిన అవకాశాలు ఏవి రాహుల్ గాంధీకి ఇవ్వలేదు. వీటికి బదులుగా 2004లో తన పొలిటికల్ కెరీర్ నీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని అమేది కాన్స్టిట్యూషన్ నుండి స్టార్ట్ చేశారు. ఈ అమ్మేది కాన్స్టిట్యూషన్ అనేది కాంగ్రెస్ అడ్డా అన్నమాట. ఇక్కడ రాహుల్ గాంధీ ఏ కాదు ఎవరు పోటీ చేసినా గెలుస్తారన్నమాట. అంత ఈజీ ప్లేస్ లో కాంగ్రెస్ రాహుల్ గాంధీని పోటీ చేయించి గెలిపించింది. అలాంటి ఈజీ ప్లేస్ నుండి పోటీ చేసి గెలిచాడు.
తరువాత 2007లో రాహుల్ గాంధీని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కి చైర్మన్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు 2007కు ముందు అలాంటి పొజిషనే లేదు. జస్ట్ రాహుల్ గాంధీ కోసం అలాంటి పొజిషన్ ని క్రియేట్ చేశారు. మళ్లీ 2013లో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ ని చేశారు. సేమ్ ఇక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్ అని పొజిషన్ ని ఓన్లీ రాహుల్ గాంధీ గారి కోసమే క్రియేట్ చేశారు. 2017లో రాహుల్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాక ఈ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ని తీసేశారు. ఇవన్నీ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ఫ్యూచర్ పిఎం కాండేట్ ఎదుర్కోవాల్సిన ఛాలెంజర్స్ ఏవి కూడా రాహుల్ గాంధీ ఎదుర్కోలేదు.
ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారిని తీసుకోండి ఆయన గుజరాత్ కి 13 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ఆ టైంలో కొంచెం డెవలప్ చేశారు. 2014 ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఆ టైంలో తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పార్టీ పెద్దగా లేదు. కానీ ఎవరిని కదిలించిన ఈసారి పీఎం గా నరేంద్ర మోడీ గారు అయితే బాగుండేది అని అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్లు ఏం చెప్పే వాళ్ళు అంటే గుజరాత్ ని చూపించి చూడండి ఎలా డెవలప్ చేశారో అందుకే ఆయన వస్తే ఇండియాని కూడా బాగా డెవలప్ చేస్తారు. ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేవాళ్లు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక పీఎం క్యాండెట్ ని బిజెపి ఆయన సీఎంగా పనిచేసిన రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ ని బాగా ప్రొజెక్టు చేసి ఆ పియం కాండేట్ కి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చింది అన్నమాట. అలాంటి ప్రొజెక్షన్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఇవ్వలేకపోయింది.
గ్రౌండ్ వర్క్ అండ్ ప్రజెంట్స్: ఈ డైనాస్టీ అనే ముద్రని, ఎక్స్పీరియన్స్ లేదు అనే పాయింట్ని కూడా లైట్ తీసుకోవచ్చు రాహుల్ గాంధీ గారు జనాల ముందుకి వస్తే. ట్విట్టర్లో తప్ప ఆయన ఎక్కడా కనిపించరు. ట్విట్టర్ లో ట్రీట్ చేయడం చాలా ఈజీ కానీ గ్రౌండ్ వర్క్ చేయడం, మూమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం అంత ఈజీ కాదు. ఈజీ కానివి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫేస్ అయ్యే క్వాలిటీ రాహుల్ గాంధీకి వస్తుంది. ప్రజెంట్ ఉన్న మీడియా పక్షపాతం చూపిస్తుంది. గవర్నమెంట్ కే సపోర్ట్ చేస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. గవర్నమెంట్ ఏం తప్పులు చేసినా చూపించదు. గవర్నమెంట్ ఏదైనా మంచి పనులు చేస్తే చూపిస్తుంది. అపోజిషన్ పార్టీ వాళ్లు ఏ మంచి పని చేసినా చూపించదు. అఫ్కోస్పక్షపాతం చూపిస్తుంది. వాళ్లకు ఉండే స్వార్థం వాళ్లకు ఉంటుంది. అలా అని లైట్ తీసుకుంటే ఎలా? డిజిటల్ మీడియా పబ్లికేషన్స్ చాలా ఉన్నాయి. కావాలంటే వాటిల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు. కానీ ఆయన ఓన్లీ 2014 ఎలక్షన్స్ కు ముందు మాత్రమే ఈ ప్లాట్ ఫామ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తర్వాత కనిపించలేదు.
![]() |
Congress |
ఈ సంవత్సరంలోనే రాహుల్ గాంధీ ర్యాలీస్ ని మూమెంట్స్ ని స్టార్ట్ చేశారు. ఇది ఒక మంచి విషయం. కానీ కాస్త లేటుగా స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది. రీసెంట్ గానే కాంగ్రెస్ భారత్ జోడోయాత్ర అని ఒక పాదయాత్ర ని స్టార్ట్ చేసింది. లేట్ అయినా సరే రాహుల్ గాంధీ గ్రౌండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియాలి. గ్రౌండ్ వర్క్ తో పాటు రాహుల్ గాంధీ చేయాల్సిన మెయిన్ థింగ్ తన పబ్లిక్ రిలేషన్ షిప్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక పీఎం క్యాండెట్ అవ్వాలనుకున్న పర్సన్ పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ప్రజెంట్ ఉన్న మన సీఎం నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకుంటే చాలు. ఆయన కంటే దిట్ట ప్రజెంట్ ఎవరూ లేరు నాకు తెలిసి. మన శత్రువైన అతనిలో మంచి క్వాలిటీస్ ఉంటే మనం అది నేర్చుకోవడంలో తప్పులేదు. ప్రజెంట్ బిజెపి లాంటి ఒక పవర్ఫుల్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తన నరేటుని మార్చుకోవాలి. నరేటు అంటే కాంగ్రెస్ ఒక ప్లాన్ తో ముందుకెళ్లాలి. అఫ్కోర్స్ అన్ని పార్టీలు ప్లాన్ తోనే ముందుకు వెళ్తాయి. పోయిన రెండుసార్లు కాంగ్రెస్ వేసిన ఏ ప్లాన్ కి ప్రజలు కన్విన్స్ అవలేదు. సో ఈసారి వేసే ప్లాన్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే కాంగ్రెస్ కి ఛాన్స్ ఉంటుంది. రాహుల్ గాంధీ ముందు ఉంటే మిగతా లీడర్స్ ని కూడా వెలుగులోకి తీసుకొని రావాలి. ఆ షాడో లో ఉంటే కష్టం.