Type Here to Get Search Results !

Translate

Dubai Indian workers life దుబాయ్ చీకటి కోణం

Dubai Indian workers life దుబాయ్ చీకటి కోణం

Dubai-indian-workers-life

దుబాయ్ అంటే మనకు ఆకాశాన్ని తాకే భవనాలు, మాన్ మేడ్ ఐలాండ్స్, విలాసవంతమైన హోటల్ రూమ్స్ కనిపిస్తాయి. కానీ కానీ ఇది పూర్తిగా మనకు కనిపించే దుబాయ్ కాదు. ఈ మేడిపండు లాంటి దుబాయ్ లోపల మనకు తెలియని చీకటి కోణాలు చాలా ఉన్నాయి. అవి మనకు సోషల్ మీడియాలో కనిపించవు. టూరిస్టులకు సెలబ్రిటీలకు అయితే అస్సలు కనిపించవు. 

దుబాయ్ పీపుల్ మూడు విభాగాలుగా విడిపోవడం జరుగుతుంది. 

1. మొదటి భాగంలో దుబాయ్ షేక్ లు ఎమెరెటిస్ గా పిలవబడే ఈ దుబాయ్ కింగ్స్ ఉంటారు. వీళ్ళు చాలా విలాసంగా ఉంటారు. నచ్చిన కోరికలు తీర్చుకుంటారు. ఒక సగటు దుబాయ్ కింగ్ కనీసం ఫెరారీ కార్ ని కలిగి ఉంటారు. మనందరికీ దుబాయ్ అంటే గుర్తొచ్చేది వీళ్లే. 

2. రెండవ భాగంలో ఫారిన్ బిజినెస్ మెన్లు, అక్కడ ఉండే కంపెనీ యొక్క C.E.O లు ఉంటారు. వీళ్లు దుబాయ్ ని ఎలా డెవలప్ చేయాలి. కొత్త కొత్త స్కై  స్క్రాపర్స్  ని ఎలా నిర్మించాలి అని అని అక్కడ రెస్టారెంట్ అండ్ బార్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఈ రెండు విభాగాలు దుబాయ్ మీకు మిరుమిట్లు కురిపించే స్వర్గధామంలా చూపిస్తాయి. 

3. కానీ దుబాయ్ యొక్క డార్క్ సైడ్ చూడాలంటే మూడో వర్గమైన అక్కడి వలసదారులను చూస్తే గాని అర్థం అవ్వదు. వందల సంఖ్యలో కనిపిస్తున్నా ఈ మిరుమిట్లుగొలిపే ఎత్తయిన బిల్డింగులను నిర్మిస్తుంది వలస కార్మికుల సహాయంతోనే. మనకి వాటిని చూడటానికి, అక్కడ టూర్స్  వేసి రావడానికి బాగానే ఉంటుంది.  కానీ ఎత్తైన భవనాలు వెనక చీకటి  కోణాలు దాగి ఉన్నాయి.  వాటి గురించి మనకు ఎవరు చెప్పరు.  మన భారతదేశం నుంచి చాలామంది డబ్బులు సంపాదించడానికి వేరు వేరు విదేశాలకు వెళుతుంటారు. అందులో భారతీయులు ఎక్కువగా వెళ్ళేది దుబాయ్ కె. ఎందుకంటే భారతీయులకు దుబాయిలో తొందరగా ఉద్యోగాలు దొరుకుతాయని. 

అనేకమంది బంగ్లాదేశ్ మరియు భారతదేశానికి చెందిన కార్మికులకు మెరుగైన జీవితాన్ని, అధిక జీవితాన్ని అంతులేని అవకాశాల్ని ఇస్తానని మాట ఇచ్చి వాళ్లని ఎట్రాక్ట్ చేసే దుబాయ్ కి తీసుకొని వస్తారు. అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళు తిరిగి వచ్చే వాళ్ళు భారతీయులు చెప్పేది ఏంటంటే వాళ్లు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ని పేస్  చేస్తారు అని. కొన్ని కొన్ని సార్లు తిరిగి భారతదేశానికి రావడానికి కూడా చాలా  కష్టం గా మారిపోతుంది. ఎందుకంటే విదేశాలలో ఉద్యోగాలు కావాలి అంటే కచ్చితంగా ఏజెంట్ ని కలవాల్సి ఉంటుంది. దుబాయ్ వెళ్లి వాళ్లకు డ్రైవర్లుగా, మెడికల్ స్టోర్ కీపర్ గాను చిన్నాచితకా ఉద్యోగాలను వాళ్లకు ఇప్పిస్తాడు. మన వాళ్ళకి మంచి ఉద్యోగం పేరు చెప్పి ఆశ పెట్టి తీసుకొని వెళ్తారు. దుబాయ్ లో ల్యాండ్ అవ్వగానే పరిస్థితి మారిపోతుంది. చెప్పిన ఉద్యోగాలు ఒకటైతే దుబాయ్ కి వెళ్ళిన తర్వాత చేసే ఉద్యోగాలు వేరేగా ఉంటాయి. వీసా కోసం అధిక మొత్తంలో డబ్బులు కట్టి దుబాయ్ చేరుకున్నాక అక్కడ రోజుకి 12 గంటలు పని  చేపిస్తూ అతి తక్కువ జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ జీతాన్ని వారు నిత్యవసర ఖర్చులకు వాడుకుంటూ, కొంత ఆదాయం ఫ్యామిలీస్ కి పంపిస్తూ, మరికొంత జీతాన్ని సేవింగ్స్ చేస్తూ డైలీ లైఫ్ ని గడపాల్సి ఉంటుంది.

దుబాయ్ లో కార్మికుల భయంకర జీవనపరిస్థితులు

దుబాయ్ కి వలస వెళ్లే కార్మికుల జీవన పరిస్థితులు అతిభయంకరంగా ఉంటాయి. ఈ 2022 నాటికి దుబాయ్ యొక్క జనాభా 35 లక్షలు.  ఇందులో 32 లక్షల మంది నాన్ ఎమిరేట్స్ అంటే వేరే దేశాల నుండి వచ్చిన వారే. ఇందులో 95 శాతం మంది దక్షిణాసియాకు చెందిన వారే ఉన్నారు. ఇందులో మెజార్టీ పీపుల్  మంచి లైఫ్ దొరుకుతుందని దుబాయ్ చేరుకుంటారు. కానీ వీళ్ళ పాస్పోర్ట్, ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు కానీ,  హయ్యర్ అధారిటీ కి చెందిన ఆఫిసర్స్ గాని సేవ్ చేయడం జరుగుతుంది. 

ఎందుకంటే వీళ్ళని రిటర్న్ వాళ్ల దేశానికి వెళ్ళనీయకుండా ఉంచడం కోసం. పోనీ అక్కడ ఉంచినందుకు వీళ్లకు మంచి సదుపాయం కల్పిస్తారా అంటే అదీ లేదు.  7, 8 మందిని ఒకే చిన్న రూములో ఉంచుతారు. కరెంటు సదుపాయం సరిగా ఉండదు. నాణ్యత లేని ఆహారం, పరిశుభ్రంగా లేని నీరు, సదుపాయం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు రోగాలకి గురవుతూ ఉంటారు. గవర్నమెంట్ ఎందులోనూ ఇన్వాల్వ్ అవును అని చెప్పడంతో అక్కడ ఏజెంట్స్, ఎంప్లాయిస్ ఎంత జీతం ఇస్తే అంతే తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ప్రభుత్వ కార్యాలయం కూడా ఉండదు. ఒకవేళ పని చేయను అని మారం చేస్తే అక్కడినుంచి బహిష్కరించడం జరుగుతుంది. జైలు శిక్షలు కూడా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

దుబాయ్ లో డ్రైవర్ ఉద్యోగాలు చాలా త్వరగా దొరుకుతాయి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు చాలా డబ్బున్నవాళ్ళు. వీళ్ళకి ఒక్కో ఫ్యామిలీ కి 4 కార్లు అయినా ఉంటాయి. అందువల్లే డ్రైవర్ ఉద్యోగాలు చాలా త్వరగా దొరుకుతాయి. కానీ ఈ దేశంలో డ్రైవింగ్ అంత ఈజీ కాదు. డ్రైవర్ వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ అయినా ఆ డ్రైవర్ చాలా పెద్ద మొత్తంలో ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కారుకి దుమ్ము పట్టిన కూడా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అప్పుడు మన భారతీయులకు డ్రైవింగ్ చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే అక్కడి వాహనాలు కుడి వైపు నడుస్తూ ఉంటాయి. స్టీరింగ్ అనేది ఎడమవైపు ఉంటుంది. పొరపాటున రాంగ్ రూట్ లో వెళ్ళినట్లయితే అక్కడి సీసీ కెమెరాలకు వెంటనే చిక్కిపోతారు. అలాగే ఇక్కడ పెళ్లి కాని జంట ఒకే రూమ్ లో ఉంటే కఠినమైన చట్టాలు ఉంటాయి. మన దేశంతో పోల్చితే దుబాయ్ లో లీటర్ పెట్రోల్ కన్నా లీటర్ వాటర్ బాటిల్ ధర ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ ఈజీగా దొరుకుతుంది. కానీ నీరు మాత్రం దొరకదు. ఎందుకంటే సిటీ అంతా ఎడారి తో నిండిపోయి ఉంటుంది.

దుబాయ్ లో కేవలం 2 విధాలుగా మాత్రమే  నీళ్లు లభిస్తాయి. 

1. గ్రౌండ్ వాటర్

2. సముద్రం నీరు 

మొదటి సోర్స్ లో కేవలం 1శాతం మాత్రమే సప్లై అవుతుంది. మిగతా 99 శాతం మంది సముద్రం నీటిని డిశానిటేషన్ చేయగా తయారైన నీటిపై ఆధార పడుతూ ఉంటారు. కాస్త  ఎండలు ఎక్కువ అయినా టూరిస్టులను బిల్డింగ్ లోనే ఉండమని చెబుతుంది. అక్కడి గవర్నమెంట్. కానీ ఈ వలస  కార్మికులను మాత్రం 50 డిగ్రీల ఎడారి ఎండలో పని చేయాల్సిందిగా ఆర్డర్ వేస్తోంది. దీని ద్వారా అక్కడ సూసైడ్ కేసులు ప్రతి సంవత్సరం అనేకంగా పెరుగుతూ వస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం వారానికి దాదాపు ఇద్దరు వలస కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కానీ ఇవన్నీ అక్కడి గవర్నమెంట్ కు అవసరం లేదు. అతి ఎత్తైన బిల్డింగ్ లు నిర్మించాలి. ప్రపంచం మొత్తం తన వైపు  ఆకర్షించుకోవాలి. తన ఆర్ధిక వ్యవస్థని మరింత అభివృద్ధి చేసుకోవాలి. అని మాత్రమే ఆలోచిస్తుంది. కానీ ఈ అందాల మెడలు విలాసవంతమైన  జీవనం వెనుక ఒక హర్రర్ స్టోరీనే రన్ అవుతుందని గుర్తించాలి.

దుబాయ్ మేడిపండు లాంటిది. మెరిసే ఫెరారీ కార్లు, అవి తిరగడానికి అతి వెడల్పయిన రోడ్లు, బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తైన భవనాలు, వాటర్ ఫౌంటెన్ లు వీలైతే ఆక్వేరియంలో కూడా ఈత కొట్టొచ్చు. ఇది బయటకు కనిపించే దుబాయ్.  కానీ దాని లోపలికి వెళ్ళి చూస్తే తప్ప మీకు నిజమైన ప్రపంచం కనిపించదు. 

దుబాయిలో చీకటి కోణం

దుబాయ్ లో మనకు కనిపించని మరొక చీకటి కోణం కూడా ఉంది. ఒకవైపు దుబాయ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రావెల్ హబ్ గా మారిపోయింది. ఇంటర్నేషనల్ ట్రాఫిక్ పెరుగుతూ వస్తోంది. కానీ మరోవైపు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా పెరుగుతుంది. మనం అనుకుంటాం దుబాయ్ కి అంత మని రావడానికి కారణం ఆయిల్ అని.  కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే దుబాయ్ కి వచ్చే రెవెన్యూలో ఆయిల్ వాటా కేవలం 1శాతం మాత్రమే. మరి దుబాయి వద్ద అంత మనీ ఎక్కడిది? అంటే టూరిజం. దుబాయ్ కి వచ్చే రెవెన్యూ మాక్సిమం టూరిజం నుంచి వస్తుంది.

దుబాయ్ ఈరోజు గ్లోబల్ హబ్ గా మారిపోయింది. ఇంటర్నేషనల్ బిజినెస్ లు, టూరిజం వల్ల ఈ వ్యభిచారానికి ఛాన్స్  దొరుకుతుంది. ఎక్స్ట్రా గర్ల్స్ ని వారు కోరుకుంటున్నారు. ఎక్కువగా యంగ్ గర్ల్స్ పైన డిమాండ్ ఎక్కువ అయిపోయింది. అక్కడ వాళ్లకు మంచి జాబ్స్ ఇస్తామని చెప్పి బయటి దేశాల నుంచి దుబాయ్ కి తరలిస్తారు. తీరా అక్కడికి చేరాక వాళ్లని వ్యభిచారంలోకి లాగేస్తారు. వాళ్ల పాస్పోర్టులు లాగేసుకొని బ్లాక్ మెయిల్  చేస్తారు. దుబాయ్ లోని కార్మికుల జీవితాల లాగానే. దుబాయ్ గతం కూడా ఇసుకలో కప్పి వేయబడింది. ఇక్కడ దుబాయ్ బీజింగ్ ఒక్కటే దుబాయి గతాన్ని మనకు తెలియజేస్తుంది. లేట్ 1960లో బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తర్వాత యూఏఈ బంగారం మరియు ఆయిల్ రిసోర్స్ ని కనుగొంది. ఆ సమయంలో అక్కడి ప్రజలు ఒంటెలు తోలుకొని బ్రతికేవారు. 1970 వరకు దుబాయ్ లో ఒక్క  ఎత్తైన భవనం కూడా ఉండేది కాదు. అప్పుడే షేక్ ముక్తిమ్ అనే ఎమెరిటి ఫారినర్స్ ని టాక్స్ ఫ్రీ  లైఫ్ పేరుతో ట్రాప్ చేసి రప్పించాడు. 50 ఏళ్లలో దుబాయ్ ఆకాశాన్ని తాకే భవనాలతో ఈ విధంగా మారిపోయింది. దుబాయ్ కచ్చితంగా చూడదగ్గ టూరిస్ట్ స్పాట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దుబాయ్ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా పేరు పొందింది. ఆకాశాన్ని తాకే భవనాలు కట్టి టూరిస్టులను ఎట్రాక్ట్ చేయడం ఓకే కానీ వలస కార్మికులు ఆకర్షించే మరియు వారిని ట్రీట్ చేసే పద్ధతులు మాత్రం మారాలి. అక్కడి గవర్నమెంట్ వాళ్ళకి అండగా ఉండి మంచి సదుపాయాలు కల్పిస్తే నిజంగా దుబాయ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. 


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.