India Vs Pakistan Cricket match పై Dwayne Johnson సంచలన వ్యాఖ్యలు
చిరకాల ప్రత్యర్ధులు టీం ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి అంత సిద్ధమైంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గత ఏడాది టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతిలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేదా అనేది అక్టోబర్ 23న తేలిపోనుంది. టి20 ప్రపంచ కప్ ఆరంభమైనప్పటికీ ఈ రెండు చెట్ల మధ్య జరిగే పోరులోని వరల్డ్ కప్ పిక్ స్టేజ్ కి చేరుకోనందునడంలో సందేహం లేదు.
తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ డ్వేన్ జాన్సన్ టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సూపర్ హీరో ప్రస్తుతం తన సినిమా బ్లాక్ ఆడం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానంది. కాగా ఈ మాజీ డబల్యూ డబల్యూ స్టార్ ది రాక్ సినిమా ప్రమోషన్ కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం టీమ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై డ్వేన్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలను వీడియో రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం రాక్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఇద్దరు గొప్ప ప్రత్యర్ధులు పోట్లాడుతున్నారంటే ప్రపంచం మొత్తం ఆ ఇద్దరినీ చూస్తూ ఉంటుంది. టీం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగేది ఒక మ్యాచ్ కాదు, అంతకుమించి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డోంట్ మిస్ అంటూ బెంజాన్సన్ పేర్కొన్నారు. ఇకపోతే ఐసీసీ మేజర్ టోర్నీలో పాకిస్తాన్ పై టీమ్ ఇండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్ లో ఇరుజట్లు తలపడిన 7సార్లు టీమ్ ఇండియాదే విజయం. ఇక టి20 ప్రపంచ కప్ లోను 6సార్లు తలపడితే టీమిండియా 4సార్లు, పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు.