Type Here to Get Search Results !

Vinaro Bhagyamu Vishnu Katha Movie Review | Telugu News India

"వినరో భాగ్యము విష్ణు కదా" మూవీ రివ్యూ


Vinaro-Bhagyamu-Vishnu-Katha-Review

వినరో భాగ్యము విష్ణు కదా టీజర్ బాగుండే, ట్రైలర్ యావరేజ్ గా ఉండే. కానీ సినిమా బాడ్ గా ఉంది. అవే షాట్ లు, అవే యాక్టర్ లు. అదే మ్యూజిక్. మరి తేడా ఎక్కడ వస్తున్నట్టు! "రైటింగ్" సినిమాలో కాన్సెప్ట్ ఉంది. నెంబర్ నైబర్ అని, హీరో క్యారెక్టర్ బై నేచర్ అందరికీ హెల్ప్ చేసే టైపు. కథ మొత్తంలో ఈ రెండు విషయాలు మెయిన్.  

స్టోరీ లో ఈవెంట్స్ అన్ని ఈ రెండు విషయాలు చుట్టూనే తిరుగుతా ఉంటాయి. నిజానికి ఇవి రెండు కూడా ఇంటరెస్టింగ్ సినిమాటిక్ ఎలెమెంట్స్. కానీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చిందంటే రైటర్ డైరెక్టర్ మురళి కిషోర్ ఈ రెండు ఐడియాస్ చుట్టూ ఒక ఫుల్ లెన్త్ స్టోరీ ని రెడీ చేసుకోలేకపోవడమే. 

ఒరిజినల్ ఐడియాస్ చుట్టూ ఉన్న కదా దాదాపుగా ఒక 40 నిమిషాలు ఉంటది. కానీ మూవీ రన్ టైం 2గంటలు పైననే. అంటే దీని అర్థం మిగిలిన టైంలో ఏముంటాయి? పాటలు, ఫైట్ లుకామెడీ సీన్ లు, పిల్లర్ సీన్ లు. పాటలు, ఫైట్ లు. కామెడీ సీన్ ల తోని ఇష్యూ లేదు. కమర్షియల్ సినిమా అన్నాక ఉంటాయి. ఉండాలి కూడా. 

కానీ మేటర్ ఏంటంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నా కూడా పాటలు యావరేజ్ గా ఉన్నాయి. ఫైట్ లు పర్లేదు. కానీ కామెడీ అస్సలు లేదు. అది చాలా పెద్ద మిస్టేక్. అసలు సినిమా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫిల్లర్ సీన్స్. ఫిల్లర్ సీన్ లు అన్ని మూవీస్ లో ఉంటాయి. వీటిని అయినంత వరకు అవాయిడ్ చేయాలి. 

కానీ ఇంకా కమర్షియల్ సినిమాల్లో అన్ని ఎలెమెంట్స్ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి, వీటికి మూలకథ తోని జెనరల్ గా సంబంధం ఉండదు కాబట్టి ఫిల్లెర్ సీన్ లు పెట్టి ఏదో ప్యాచ్ వర్క్ చేస్తారు. అది ఇంకా కమెర్షియల్ సినిమాల్లో సహజం. కానీ ఇక్కడ ఇష్యూ ఏందంటే జనరల్ గా అన్ని సినిమాల్లో ఫిల్లెర్ సీన్స్ ఉంటాయి. కానీ "వినరో భాగ్యము విష్ణు కథ" లో మాత్రం ఫిల్లెర్ సీన్స్ మధ్యలో సినిమా ఉంది. ఫిల్లెర్ సీన్స్ ని సినిమా కథలోకి జాయిన్ చేసే ప్రయత్నం ఏ మాత్రం జరగలేదు. 

ఫర్ ఎక్షామ్ ఫుల్ పించన్ రావడం లేదని ఒక ముసలావిడ బాధ పడుతున్నప్పుడు మన హీరో వెళ్లి హెల్ప్ చేస్తాడు. మొత్తం సీక్వెన్స్ లో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఒక ఫైట్ ఉంటది. ఒక ఫ్రీచీ సీన్ కూడా ఉంటుంది. కానీ కథ మొత్తం లో ఈ సీక్వెన్స్ కి సిగ్నిఫికెన్స్ ఏంటి? హీరో క్యారెక్టర్ ఈ సీక్వెన్స్ కి ముందు ఏ పాయింట్ లో స్టార్ట్ అవుతాడో సీక్వెన్స్ ఎండ్ కి కూడా అదే పాయింట్ లో ఉంటాడు. ఆయన లైఫ్ లో గాని, బిహేవియర్ లో గాని ఎటువంటి చేంజ్ రాదు. అలాంటప్పుడు ఈ సీక్వెన్స్ ఉండి అర్థం ఏంటి? 

ఇప్పుడు మనం ఫిల్లెర్ సీన్స్ గురించి ఒక గ్రేట్ ఎక్సామ్ ఫుల్ చూద్దాం. ఇంద్ర మూవీ లో "వీర శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా" సీన్. నేను కంపేర్ చేస్తాలేను, ఎక్ష్ప్లైన్ చేస్తున్నాను. వీర శంకర్ రెడ్డి చెడ్డోడు, ఇంద్రసేనారెడ్డి మంచోడు. ఈ ఇద్దరికీ ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఈ మొక్క సీన్ వచ్చేముందు అంతే ఉంటది. వచ్చిన తర్వాత కూడా అంతే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇదొక ఫిల్లెర్ సీన్. ఈ సీన్ ఎందుకు పెట్టారు? అవసరం ఏముంది? కథలో ఆ టైం కి ఒక ఎలివేషన్ సీన్ పడాలి అక్కడ అని. ఈ రిక్వైర్మెంట్ ని రెవెర్స్ ఇంజినీరింగ్ చేసి కథలోకి ఎలా యాడ్ చేసిండ్రు. అది పాయింట్. 

ఈ సీన్ తరువాత వీర శంకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి ల ఎక్వషన్ ఇంకొంచెం చెడింది. ఉన్నదానికన్నా వరెస్ట్ అయింది. అట్లా చిన్నఇంక్రిమెంటల్ చేంజ్ చేసిన్రు. సొ అన్ని పర్పస్ లో సాల్వ్ అయినాయి అన్నట్టు. ఒక ఎలేవేషన్ సీన్ పడ్డది. తెలుగు సినిమా హిస్టరీ లోనే ఒక గ్రేట్ మాస్ సీన్.

అండ్ కథ ఫ్లో కూడా డిస్ట్రబ్ కాలేదు. అండ్ ఎంతో కొంత ముందు గొడవ అయింది కదా? అక్కడనే ఆగిపోలేదు. ఇట్లా ఉండాలి ఫిల్లెర్ సీన్ లు అంటే. కానీ అనుకోకుండా "వినరో భాగ్యము విష్ణు కథ" లో ఇదే ఇష్యూ. ఇర్రేల్లేవంట్ సీక్వెన్స్ లు చాలా ఉన్నాయి. అండ్ అవి మనకు కావాల్సిన హై ఇవ్వవు. అలా అని స్టోరీ ని కూడా ముందుకు తీసుకు పోవు. 

మొత్తం కలిపి తక్కువ రన్ టైం ఉన్న మూవీ ని కూడా బోర్ కొట్టే లాగా చేస్తాయి? నేను ఇంద్ర తోని కంపేర్ చేస్తలేను. అర్ధం కావడానికి ఈజీ ఎక్సామ్ ఫుల్ తీసుకున్నా అంతే. కానీ "వినరో భాగ్యము విష్ణు కథ" మూల కథ లో కూడా కొన్ని ఇష్యూ లు ఉన్నాయి. ట్విస్ట్ లు అవి అసలు వర్కౌట్ కాలేదు. మొనాటనస్ గా ఉంటది మూవీ మొత్తం. అట్లా అని పోజిటివ్స్ అసలు లేవ అంటే ఉన్నాయి. మూవీ విజువల్స్ డీసెంట్ గా ఉన్నాయి. హీరోయిన్ అందంగా ఉంది. హీరోయిన్ ని కన్విన్సింగ్ గా చేసిండు విష్ణు రోల్ ని. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా బావుంది. అండ్ తిరుపతి సెట్టింగ్ చాలా ఫ్రెష్ గా ఉంది. 

కానీ మేటర్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ కమెర్షియల్ స్పేస్ లో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. కానీ "కిరణ్ అబ్బవరం" తెలుగు సినిమా ఆడియన్స్ కి అలవాటు అయిపోయుండు. అదొక గ్రేట్ అచీవ్మెంట్. కానీ ఆయన సినిమాలే ఆయనను డౌన్ చేస్తున్నాయి. అండ్ ఇష్యూ లు మెయిన్ గా కథల్లో వస్తున్నాయి. కొంచెం స్టోరీస్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్ గా కిరణ్ నుండి మనం మంచి సినిమాలు చూడొచ్చు. 

కానీ ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్రీ గా ఉంటె వీక్ ఎండ్ లో చూడండి. "వినరో భాగ్యము విష్ణు కథ" నచ్చోచ్చు మీకు. but unfortunately మాకైతే నచ్చలేదు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.